45 రోజుల్లో ఏడంతస్తుల బిల్డింగ్ కట్టేసిన్రు

45 రోజుల్లో ఏడంతస్తుల బిల్డింగ్ కట్టేసిన్రు

మామూలుగా ఒక ఇల్లు కట్టాలంటేనే నెలల కొద్దీ సమయం పడుతుంది. ఒకటి లేదా రెండంతస్తులు కట్టడానికే కనీసం మూడు నాలుగు నెలలపైనా పడుతుంది. అయితే మన దేశ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) మాత్రం రికార్డు టైమ్‌లోనే ఏడంతస్తుల బిల్డింగ్ కట్టేసింది. కేవలం 45 రోజుల్లోనే అత్యాధునిక సౌకర్యాలు ఉండేలా భవన నిర్మాణంపూర్తి చేసింది. 

డిఫెన్స్ రీసెర్చ్ కోసమే...

 బెంగళూరులో నిర్మించిన ఈ ఏడంతస్తుల బిల్డింగ్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఇవాళ ప్రారంభిస్తారు.  ఐదో జనరేషన్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌‌క్రాఫ్ట్స్‌ను (AMCA) దేశీయంగా తయారు చేసేందుకు పరిశోధనల (ఆర్ అండ్ డీ) కేంద్రంగా ఈ బిల్డింగ్‌ను వాడుకోనున్నట్లు  డీఆర్డీవో అధికారులు తెలిపారు. ప్రధానంగా ఈ ఎయిర్‌‌క్రాఫ్ట్స్‌లో ఉండే ఫైట్ కంట్రోల్ సిస్టమ్‌కు సంబంధించిన ఏవియానిక్ పరికరాల అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.