T20 World Cup: టాస్ గెలిచిన పాకిస్థాన్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్.. 

T20 World Cup: టాస్ గెలిచిన పాకిస్థాన్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్.. 

T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ తీసుకుంది. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. టాస్ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. పిచ్ కొంచెం నెమ్మదిగా ఉండటంతో.. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం.. తొలి ఓవర్లలో బౌలర్లకు సహకరిస్తుందని భావిస్తున్నాం.. మా జట్టు రిలాక్స్‌డ్‌గా ఉందన్నారు. ఈ మ్యాచ్‌కు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని పాక్ కెప్టెన్ అఘా వెల్లడించారు.
 

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మేము కూడా తొలుత బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం.. గత రెండు మ్యాచ్‌ల్లో లక్ష్యాన్ని కాపాడుకుంటూ గెలిచాం.. ఈ మ్యాచ్ లో కూడా అదే మార్గాన్ని కొనసాగించాలని భావిస్తున్నాం.. ఇది పెద్ద మ్యాచ్, హైవోల్టెజ్ ఉన్న పోరు.. క్రికెట్ ఎప్పుడూ కొత్త పాఠాలు నేర్పుతుంది.. ఏ రోజునైనా ఏ జట్టైనా గెలవగలదని అన్నారు. ఈ మ్యాచ్‌కు భారత్ జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం.. అభిషేక్ శర్మ టీంలోకి రావడంతో సంజూ శాంసన్ బెంచ్ కె పరిమితం కానున్నారు. అర్షదీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇచ్చామని సూర్యకుమార్ పేర్కొన్నారు.  

భారత్ జట్టు: 
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

పాకిస్థాన్ జట్టు: 
సైమ్ అయూబ్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్