T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గ్రూప్–ఏ నుంచి జరిగిన మ్యాచ్ లో నమీబియాపై 31 పరుగుల తేడాతో అమెరికా జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ మోనాంక్ పటేల్, ఫినిషర్ సంజయ్ కృష్ణమూర్తి ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 87 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో నమీబియా ముందు భారీ లక్ష్యం పెట్టింది.
లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా.. కూడా దూకుడుగా ఆడింది. మొదటి 5 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానాకి 51 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్ ఫ్రైలింక్ (19) తక్కువ పరుగులకే ఔట్ అయినా.. మరో ఓపెనర్ లౌరెన్ స్టీన్‌క్యాంప్ (58) హాఫ్ సెంచరీతో జట్టును అదుకునే ప్రయత్నం చేశాడు. దీంతో స్టీన్ క్యాంప్ ని మొహమ్మద్ మొహ్సిన్ ఔట్ చేయడంతో నమీబియా మళ్లీ ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జేజే స్మిత్ 31 పరుగులతో దూకుడు పెంచిన షాడ్లీ వాన్ షాల్క్విక్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. అలాగే, జేన్ గ్రీన్ రిటైర్డ్ హాట్ గా డగౌట్ కి వెళ్లిపోవడంతో నమీబియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ALSO READ : సూపర్–8కు వెస్టిండీస్.. ఇంటిదారి పట్టిన నేపాల్
నమీబియా జట్టును ఓడించడంతో అమెరికా బౌలర్లు చెలరేగిపోయారు. షాడ్లీ వాన్ షాల్క్విక్ కీలకమైన రెండు తీసుకోగా, సౌరభ్ నేత్రవల్క, అలీ ఖాన్, శుభమ్ రంజానే తలో వికెట్ పడగొట్టారు. దీంతో 20 ఓవర్లలో నమీబియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేసింది.
