రాజకీయంగా ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యం- : మంత్రి తలసాని

రాజకీయంగా ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యం- :  మంత్రి తలసాని

సికింద్రాబాద్, వెలుగు: రాజకీయంగా ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యత కల్పించిన పార్టీ బీఆర్ఎస్​అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం బేగంపేట లోని హరిత ప్లాజా లో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్యుల సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. వారు చేసే సేవలను దృష్టిలో ఉంచుకొని సనత్ నగర్ పరిధిలోని బల్కంపేట, మహంకాళి, సికింద్రాబాద్ గణేశ్, కనకదుర్గమ్మ తదితర ఆలయాల కమిటీల్లో  ఆర్య వైశ్యులకు అవకాశం కల్పించినట్లు గుర్తు చేశారు. 

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అద్బుతమైన అద్దాల మండపం నిర్మించిన బండారు సుబ్బారావును మంత్రి అభినందించారు. ప్రజల మధ్య ఉంటూ ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తానని కోరారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బండారు సుబ్బారావు, సింగారపు శ్రీనివాస్ గుప్త, మంచాల అశోక్, మహంకాళి రాజేశ్వరరావు, ఉప్పల యాదగిరి, వాడకట్టు శ్రీకాంత్ గుప్త, ఆనంద్ గుప్తా, బిజ్జాల శివశంకర్ గుప్త, నాగమణి  తదితరులు పాల్గొన్నారు.