రంగారెడ్డి జిల్లా జన్వాడలో కేటీఆర్ ఫామ్‌హౌస్ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఫామ్‌హౌస్‌ను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాసేపట్లో పరిశీలించనున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ముందస్తు చర్యల్లో భాగంగా ప్రదీప్ రెడ్డి ఫామ్‌హౌస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ప్రదీప్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఫామ్‌హౌస్ తనదేనని ప్రదీప్ రెడ్డి తెలిపారు. అలాగే కేటీఆర్ తన ఫ్రెండ్ అని.. ఫామ్‌హౌస్‌ను లీజుకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల భూదోపిడిని బయటపెడుతున్నారు. నిన్న సిద్దిపేటలోని హరీశ్ రావు భూములను పరిశీలించిన నేతలు ఇవాళ జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరకు బయల్దేరారు. ఈ క్రమంలోనే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
