దారి దోపిడీ దొంగలు దొరికిన్రు.. నలుగురిని అరెస్టు చేసిన శంషాబాద్ పోలీసులు

దారి దోపిడీ దొంగలు దొరికిన్రు.. నలుగురిని అరెస్టు చేసిన శంషాబాద్ పోలీసులు

గండిపేట, వెలుగు: శంషాబాద్ పోలీసులు దోపిడీ కేసును చేధించి నలుగురిని అరెస్టు చేశారు. మే7న కొత్తూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రిన్స్‌‌‌‌‌‌‌‌కుమార్ తన స్నేహితులు అభిషేక్‌‌‌‌‌‌‌‌కుమార్, రోషన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో కొత్తూర్‌‌‌‌‌‌‌‌కు వస్తుండగా దారి దోపిడీ జరిగింది.

ఘాన్సీమియాగూడ గ్రామ పరిధిలో ఆటో డ్రైవర్ తన ముగ్గురు సహచరులతో కలిసి వారిపై దాడి చేసి రూ.1,800, రెండు వెండి చైన్లు, ఒక వెండి ఉంగరం, రెండు మొబైల్ ఫోన్లు లాక్కొన్నారు. గూగుల్ పే ద్వారా రూ.5 వేలు బలవంతంగా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేయించుకున్నారు. విషయం బయటపెడితే చంపేస్తామని బెదిరించి పరారయ్యారు.

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి చంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్ యాసిన్, మహ్మద్ మోసిన్, అబ్దుల్ మోసిన్, అతిఫ్ ఖాన్‌‌‌‌‌‌‌‌లను అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.