హైదరాబాద్‌సిటీ, వెలుగు: హుస్సేన్‌సాగర్‌లో బుధవారం నుంచి ప్రారంభమయ్యే నిమజ్జనాలకు హెచ్ఎండీఏ ప్రత్యేకం ఏర్పాట్లు చేసింది. నిమజ్జనం చేయగానే విగ్రహాలను, పూజా సామగ్రి, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు సిద్ధమైంది.
గత ఏడాది 82.20 లక్షలతో 12,950 టన్నులను తొలగించింది. ఈసారి ఎక్కువగా వస్తుందని భావిస్తోంది. అలాగే, సాగర్ చుట్టూ 40 క్రేన్లను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన ప్లాట్‌ఫామ్‌లను నిర్మించింది. సాగర్‌ను ఎప్పటికప్పుడు క్లీన్చేసేందుకు17 ఎక్స్ కవేటర్లను సమకూర్చింది. ఇందులో 13 ఎక్స్కవేటర్లను సొంతగా సమకూర్చుకోగా, మరో నాలుగు రెంట్‌కు తీసుకుంది.
