క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • స్టూడెంట్లకు సూచించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     షేర్​ది విజన్​ఆధ్వర్యంలో 600 బ్యాగులు, మెటీరియల్​పంపిణీ

కోల్​బెల్ట్, వెలుగు: క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి సూచించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్​ సోషల్​ వెల్ఫేర్​స్కూల్​లో షేర్​ది విజన్ ఖమ్మం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో  మంగళవారం బ్యాగులు, స్పోర్ట్స్​మెటీరియల్​ను కలెక్టర్​ కుమార్ ​దీపక్, స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధి నారాయణతో కలిసి మంత్రి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను గతంలో స్కూల్​ను  సందర్శించిన సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రిన్సిపాల్, టీచర్లు తన దృష్టికి తీసుకవచ్చారన్నారు. 

దీంతో డీఎంఎఫ్​టీ నిధులు రూ.30లక్షలు, రూఫింగ్​పనులకు సింగరేణి కంపెనీ నుంచి రూ.60లక్షల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. షేర్​ది విజన్ ​సంస్థ ద్వారా 600 మంది విద్యార్థులకు బ్యాగులు, స్పోర్ట్స్​ మెటీరియల్ ​అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో త్వరలో మంచిర్యాలలో సైనిక్​ స్కూల్​తరహాలో స్కూల్​మంజూరు కానుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్​రఘునాథ్​రెడ్డి, జిల్లా స్పోక్స్​పర్సన్​ ఎండీ అబ్దుల్​అజీజ్, కాంగ్రెస్ టౌన్​ ప్రెసిడెంట్ ​వొడ్నాల శ్రీనివాస్, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపల్​ కమిషనర్లు మురళీకృష్ణ, రాజలింగు, మున్సిపల్ ​కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

అనారోగ్యంతో మృతిచెందిన మందమర్రి టౌన్​బీఆర్ఎస్​ ప్రెసిడెంట్​ జె.రవీందర్, చెన్నూరులోని పద్మనగర్ ​కాలనీకి చెందిన సంబోజు నితిన్​కుటుంబాలను మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రి వెంట కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.