కాన్బెర్రా: పాక్ మాజీ ప్రధాని, ఆ దేశ క్రికెట్మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ హెల్త్ కండిషన్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన జైల్లోనే చనిపోతారేమోనని అనుమానం వ్యక్తంచేశారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌కు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈమేరకు ఆసీస్ మాజీ కెప్టెన్లు ఏడుగురు గ్రెగ్ చాపెల్, అలన్ బోర్డర్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, కిమ్ హ్యూస్, మార్క్ టేలర్, స్టీవ్ వా కలిసి విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు లేఖ రాశారు. చట్టపరమైన లేదా రాజకీయ కేసుల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే జైలులో ఉన్న ప్రతి వ్యక్తికి సరైన మానవతా ప్రమాణాలతో వ్యవహరిస్తున్నారా అనే విషయంలో తమకు ఆందోళన ఉందని తెలిపారు. రాజకీయాలను పక్కనపెట్టిన ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని వారు లేఖలో కోరారు.
