- నల్ల మల్లారెడ్డి మేనేజ్మెంట్ కబ్జా చేసినట్లు విచారణలో వెల్లడి
ఘట్కేసర్, వెలుగు: ఘట్కేసర్ మండలం కాచవానిసింగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 66/2 నుంచి 66/5 వరకు విస్తరించి ఉన్న దాదాపు 6.12 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా సోమవారం స్వాధీనం చేసుకుంది. ఈ భూమి మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారుల అంచనా.
1985 సంవత్సరంలో నల్ల మల్లారెడ్డి విద్యా సంస్థల యాజమాన్యం ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి, లేఅవుట్ వేసి ప్లాట్లుగా విభజించి విక్రయించినట్లు హైడ్రా చేపట్టిన విచారణలో తేలింది. రికార్డుల్లో స్పష్టంగా ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి వాణిజ్యంగా వినియోగించుకోవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. భూమి చుట్టూ భారీ కంచె ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్నారు.
