చేవెళ్లలో యోగా గురువుకు వలపు వల.. రూ. 50 లక్షలు వసూలు..రూ.2 కోట్లు డిమాండ్..

చేవెళ్లలో  యోగా గురువుకు వలపు వల.. రూ. 50 లక్షలు వసూలు..రూ.2 కోట్లు డిమాండ్..

హైదరాబాద్: ఈజీ మనీ కోసం కొందరు కేటాగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. అందుకే నిత్యం మన చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. ఈ రోజుల్లో  ఎవరినీ నమ్మడానికి వీలులేదు. అనారోగ్యం పేరుతో యోగా ఆశ్రమంలో చేరిన ఇద్దరు మహిళలు ఏకంగా యోగా గురువుకే వలపు వల వేశారు.తర్వాత బ్లాక్ మెయిల్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో  చివరకు పోలీసులకు  అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ దామరగిద్ద గ్రామా రెవెన్యూ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగింది.

అసలేం జరిగిందంటే.. మిట్ట వెంకట రంగారెడ్డి ఫామ్ హౌస్ లో నిరంతరం యోగ సాధనలు  జరుగతాయి.  నల్గొండ జిల్లాకు చెందిన మణిక్ ప్రభు గురువు ఆధ్వర్యంలో వారానికి ఒకసారి ఈ సెంటర్లో యోగాను నిర్వహిస్తారు. కొన్ని రోజులు క్రితం అనారోగ్య సమస్యల పేరుతో  గుర్తు తెలియని  నలుగురు వ్యక్తులు వచ్చి ఈ యోగ ఆశ్రమంలో చేరారు.  తర్వాత యోగా గురువు రంగారెడ్డితో చనువు పెంచుకుని  ఆయనతో సన్నిహితంగా ఉన్నపుడు స్పై కెమెరాలతో  ఫొటోలు, వీడియోలు తీశారు. తర్వాత యోగా గురువు రంగారెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి  రూ.50 లక్షల చెక్కులు వసూలు చేశారు. అయితే అంతటితో ఆగని  ఈ గ్యాంగ్ మరో రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది.  దీంతో బాధితుడు రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు  ఇద్దరు మహిళలతో పాటు స్కెచ్ వేసిన మరో ముగ్గురి నిందితులను  అరెస్ట్ చేశారు. 

హనీ ట్రాప్ కోసం  ఇద్దరు యువతులు మంజుల, రజిని  నకిలీ ప్రెస్ కార్డ్ సృష్టించి స్పై కెమెరాల కొనుగోలు  చేశారని పోలీసులు తెలిపారు.  నిందితులు అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నట్లు గుర్తించారు.  రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు సరిపోక హనీ ట్రాప్ కు స్కెచ్ వేశారని చెప్పారు.  ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన గోల్కొండ పోలీసులు.