హైదరాబాద్ సిటీలో ఘోరం : నడి రోడ్డుపై కరెంట్ స్తంభం కూలి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

హైదరాబాద్ సిటీలో ఘోరం : నడి రోడ్డుపై కరెంట్ స్తంభం కూలి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

హైదరాబాద్ నగరంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం (సెప్టెంబర్ 2) తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఓ బైక్ రైడర్ దుర్మరణం చెందాడు.

నాచారం కార్తికేయ నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాత్విక్ (25) తన బైక్‌పై ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. రహదారి డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగిపడి ఆయనపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు.

ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఇలాంటి పాత, దెబ్బతిన్న స్తంభాలు మార్చడంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న నాచారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాత్విక్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.