రాజన్న సిరిసిల్ల జిల్లా: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన అన్న ట్రీట్ మెంట్ కి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిరాకరించారని నిరసన వ్యక్తం చేసింది ఓ మహిళ. ఈ సంఘటన సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. కొన్ని రోజులుగా తన అన్న పోశయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని .. దీంతో అతడిని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకువస్తే అక్కడి సిబ్బంది మంత్రి కేటీఆర్ పర్యటన ఉందంటూ.. పేషెంట్ వైద్యానికి నిరాకరించారని కన్నీరుమున్నీరుగా విలపించింది. చేసేది ఏమి లేక జిల్లా హాస్పిటల్ ముందు ఫ్లెక్సీ పట్టుకుని నిరసన తెలిపింది. తన అన్న పోశయ్యను కాపాడాలంటూ సోదరి లత… మంత్రి కేటీఆర్ ను వేడుకుంది.
