న్యూఢిల్లీ: రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఐస్ క్రీమ్ వ్యాపారంలోకి వచ్చింది. బాంబే క్రీమరీ పేరుతో కొత్త బ్రాండ్‌ను తీసుకొచ్చింది. ధరలు రూ.10 నుంచి ప్రారంభమవుతాయి. కోన్లు, కప్పులు, టబ్స్, బార్లు, స్టిక్స్ రూపాల్లో లభిస్తాయి. మొదట పశ్చిమ భారతదేశంలో అందుబాటులోకి రానున్న ఈ బ్రాండ్ త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ఆర్సీపీఎల్ సంస్థ గతంలో క్యాంపా వంటి బ్రాండ్ల ద్వారా సాఫ్ట్‌డ్రింక్స్ మార్కెట్లోకి వచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన వంతారా సంస్థ ఈ ఏడాది మేలో వంతారా క్రీమరీ పేరుతో ప్రత్యేక లగ్జరీ ఐస్ క్రీమ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇది ఆర్సీపీఎల్ ఎఫ్‌ఎంసీజీ పోర్ట్‌ఫోలియోలో భాగం కాదని స్పష్టం చేసింది.
