న్యూఢిల్లీ: ఐఫోన్ మేకర్ ఆపిల్ కంపెనీలో గత 15 సంవత్సరాలుగా సంస్థ సీఈవోగా ఉన్న టిమ్ కుక్ స్థానాన్ని జాన్ టెర్నస్ భర్తీ చేశారు. కుక్ ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతూ గ్లోబల్ పాలసీ విషయాలపై దృష్టి పెడతారు. జాన్ టెర్నస్ 2001లో ఆపిల్ సంస్థలో చేరి హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ రంగంలో కీలక పాత్ర పోషించారు. ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్, ఐఫోన్ వంటి ఉత్పత్తుల డెవలప్మెంట్కు తన వంతు సహకారం అందించారు. టిమ్ కుక్ హయాంలో ఆపిల్ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ఇదిలా ఉంటే ఐఫోన్18 సిరీస్ ఫోన్లను ఆపిల్ఈ నెల తొమ్మిదిన ఆవిష్కరించనుంది.
