కొన్ని పాజిటివ్..కొన్ని నెగెటివ్..రెండో క్వార్టర్ లో మిశ్రమ ఎకానమి

కొన్ని పాజిటివ్..కొన్ని నెగెటివ్..రెండో క్వార్టర్ లో మిశ్రమ ఎకానమి
  • ఆగస్టులో మిశ్రమంగా ఎకానమీ
  • జీఎస్టీ వసూళ్లు15 శాతం జంప్​
  • 20 శాతం పెరిగిన యూపీఐ వసూళ్లు
  • 35 శాతం పెరిగిన బండ్ల అమ్మకాలు
  • 0ఐదేళ్ల కనిష్టానికి చేరిన పీఎంఐ
  • బొగ్గు ఉత్పత్తి 5.8 శాతం పతనం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్లో భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ సంకేతాలను ప్రదర్శించింది. చాలా రంగాలు సత్తా చాటగా, కొన్ని మాత్రం వెనుకబడ్డాయి. వినియోగం, పన్ను వసూళ్లు, డిజిటల్ చెల్లింపులు పెరగగా, తయారీ రంగం బలహీనపడింది. పారిశ్రామిక రంగంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలు నిలకడగా సాగుతున్నాయి. గత నెల స్థూల జీఎస్‌‌‌‌‌‌‌‌టీ వసూళ్లు దాదాపు15 శాతం పెరిగి రూ.రెండు లక్షల కోట్లకు చేరాయి. వసూళ్లలో రెండంకెల వృద్ధి ఉండటం ఇది వరుసగా మూడోనెల. యూపీఐ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఆగస్టులో యూపీఐ లావాదేవీలు తొలిసారిగా 2,450 కోట్లను దాటాయి. వార్షికంగా లావాదేవీల పరిమాణం 22.5 శాతం పెరిగింది. వీటి విలువ 20 శాతం వృద్ధితో రూ.29.8 లక్షల కోట్లకు చేరింది.  

 4.5 లక్షల వెహికల్స్​ అమ్మకం

ఆటోమొబైల్ రంగంలోనూ డిమాండ్ బలంగా కనిపించింది. గత నెల అమ్మకాలు 35 శాతం పెరిగి 4.5 లక్షల యూనిట్లకు చేరాయి. మారుతి సుజుకి మొత్తం విక్రయాలు 21.3 శాతం పెరగగా, దేశీయ అమ్మకాలు 34 శాతం వృద్ధి చెందాయి. మహీంద్రా ప్యాసింజర్​ వెహికల్స్​(పీవీలు) అమ్మకాలు 50.4 శాతం పెరిగాయి.  హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు 8.8 శాతం, దేశీయ విక్రయాలు 23.6 శాతం పెరిగాయి. త్రీవీలర్స్​ విక్రయాలు 42 శాతం వృద్ధి సాధించాయి.  

తయారీ రంగం డీలాపన్ను వసూళ్లు, వినియోగం సానుకూలంగా ఉన్నప్పటికీ, తయారీ రంగం నుంచి ఆందోళనకరమైన సంకేతాలు వచ్చాయి. హెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌బీసీ ఇండియా తయారీ పీఎంఐ ఆగస్టులో ఐదేళ్ల కనిష్ట స్థాయి అయిన 52.8కి పడిపోయింది. ఉత్పత్తి, కొత్త ఆర్డర్లు మందగించాయి. గ్లోబల్ అనిశ్చితి, డిమాండ్ తగ్గడం వల్ల వ్యాపార వర్గాలు అప్రమత్తంగా మారాయి. రెండన్నరేళ్లలో తొలిసారిగా ఉపాధి రంగంలో క్షీణత కనిపించింది. అయితే ఇన్‌‌‌‌‌‌‌‌పుట్ ధరల ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్టానికి తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం.

బొగ్గు ఉత్పత్తి డౌన్​

పారిశ్రామిక రంగానికి సంబంధించి కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి 5.8 శాతం తగ్గగా, రవాణా 5.6 శాతం పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర 92 డాలర్లను దాటింది. ఇటీవల ముగిసిన జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా నమోదైంది. అయినప్పటికీ, భౌగోళిక రాజకీయాల అనిశ్చితి, గిరాకీ మందగించడం వంటి అంశాలు రాబోయే కాలంలో పారిశ్రామిక వృద్ధిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.