బషీర్‌బాగ్, వెలుగు: ట్యాంక్‌బండ్‌పై 100 అడుగుల శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకార శివాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా భక్తులు, శివాజీ అభిమానుల విరాళాలతోనే విగ్రహ నిర్మాణానికి అవసరమైన నిధులు సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హుస్సేన్‌సాగర్ పేరును వినాయక్ సాగర్ గా మార్చాలని, ట్యాంక్‌బండ్‌పై వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
