క్వారైంటైన్ కు హోటల్ రూమ్స్

క్వారైంటైన్ కు హోటల్ రూమ్స్

కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయం చేసేందుకు హోటల్‌ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ(ఐహెచ్‌సీఎల్‌), ఐటీసీ, ది లలిత్‌, లెమన్‌ ట్రీ, రాడిసన్‌ హోటల్స్‌, ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌ గ్రూప్స్‌(ఐహెచ్‌జీ), ఇతర హోటల్‌ చెయిన్స్‌ ప్రజలను క్వారంటైన్‌లో ఉంచడానికి తమ హోటల్‌ రూములను కేటాయిస్తున్నాయి. దేశం మొత్తం మీద సుమారుగా 45,000 పైగా రూములను అందుబాటులోకి తెచ్చామని హోటల్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. కేవలం క్వారంటైన్‌కు మాత్రమే కాకుండా మెడికల్‌ స్టాఫ్‌కు వసతి కల్పించడానికి, దేశంలో ఉండిపోయిన ట్రావెలర్స్ కోసం కూడా ఈ రూంలను అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ రూములను ఫ్రీగా లేదా తక్కువ రేటుతో అందుబాటులో ఉంచాయి. మరి కొన్ని హోటల్స్‌ తమ రూమ్‌లపై డిస్కౌంట్లను ఇస్తున్నా యి. వీటితోపాటు ఫ్రంట్‌లైన్‌ సర్వీసు లో ఉన్న వారికి హోటల్‌ కంపెనీలు ఫ్రీగా మీల్స్ ను ఆఫర్‌ చేస్తున్నాయి.

ప్రభుత్వం కోరడంతో..

కరోనాపై పోరులో భాగంగా వీలైనన్ని ఎక్కువ రూములను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, హోటల్స్‌ ఈ విషయంలో కలిసి పనిచేయాలని హోటల్‌ ఇండస్ట్రీ ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లెటర్స్ ను పంపింది. రీజినల్, సిటీ, స్టేట్‌ లెవెల్లోని హోటల్స్‌ తమ మద్ధతును ప్రకటిస్తున్నాయని ఫెడరేషన్‌ ఆఫ్ హోటల్స్, రెస్టారెంట్‌ అసోషియేషన్‌(ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) తెలిపింది. లోకల్‌ అధికారులకు, ఎన్‌జీఓల కోసం దేశం మొత్తం మీద సుమారుగా 45,000 రూమ్‌లను అందుబాటులో ఉంచామని ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ వైస్‌ ప్రెసిడెంట్‌ గుర్‌భక్ష్‌ సింగ్‌ కోహ్లి అన్నారు. కరోనాపై పోరాడేందుకు కేంద్ర, రాష్ట్ర, లోకల్‌ అధికారులకు మద్దతుగా హాస్పిటల్‌ ఇండస్ట్రీ ఉందని చెప్పారు. 5 స్టార్‌ హోటల్స్‌ నుంచి చిన్న చిన్న హోటల్స్‌ వరకు తమ సాయాన్ని ప్రకటిస్తున్నాయని తెలిపారు.

కరోనాపై లగ్జరీ హోటల్స్‌..

టాటా గ్రూప్‌‌కు చెందిన ఐహెచ్‌సీఎల్‌ తమ లగ్జరీ హోటల్స్‌ను క్వారంటైన్‌కు, మెడికల్‌ స్టాఫ్‌ వసతి కోసం అందుబాటులో ఉంచింది. ముంబైలోని ఐహెచ్‌సీ ఎల్‌ హోటల్స్‌ తాజ్‌ మహాల్‌ పాలేస్‌, తాజ్‌ ల్యాండ్స్‌ ఎండ్‌‌, తాజ్‌ శాంటాక్రజ్‌, ది ప్రెసిడెంట్‌ హోటల్స్ ను హెల్త్‌‌ వర్కర వసతి కోసం కంపెనీ కేటాయించింది. భువనేశ్వర్‌, ఫరీదాబాద్‌, బెంగళూరులోని ఐహెచ్‌సీ ఎల్‌ జింజర్‌ హోటల్స్‌ను ప్రజలను క్వారంటైన్‌లో ఉంచడానికి కేటాయించింది. ముంబై, నోయిడాలోని జింజర్‌ హోటల్స్‌ను మెడికల్‌స్టాఫ్‌ కోసం కంపెనీ అందుబాటులో ఉంచింది. ముంబైలోని ఐటీసీ మరాఠాతో పాటు, బేంగళూరులోని ఐటీసీ హోటల్‌ రూమ్‌లను క్వారంటైన్‌ కోసం ఐటీసీ కేటాయించింది. ఢిల్లీలోని ది లలిత్‌ హోటల్‌లో డాకర్టకు వసతిని కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.