Vastu tips  : మట్టి.. సిమెంట్ గోడల్లో ఏది బెస్ట్.. ఏదిక్కు గోడలకు ఎలాంటి రంగులు వాడాలి..

Vastu tips  : మట్టి.. సిమెంట్ గోడల్లో ఏది బెస్ట్.. ఏదిక్కు గోడలకు ఎలాంటి రంగులు వాడాలి..

ప్రతి ఒక్కరు చిన్నదో.. పెద్దదో సొంతిల్లు కట్టుకోవాలనుకుంటారు.  ఖర్చు తక్కువతో.. అన్ని విధాలా వాస్తు అనుకూలంగా ఉండే విధంగా ఇంటిని నిర్మించుకోవాలనుకుంటారు.  అంతే కాదు  పూర్వకాలంలో  పెద్దలు నిర్మించిన పెద్ద పెద్ద ఇళ్లను రిమూవ్​ చేసి ఆధునిక కాలంలో జీవనశైలికి అనుగుణంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు.  ఇంటి గోడలు నిర్మించేటప్పుడు సిమెంట్​ ఇటుకలు.. మట్టికల్లో వాస్తు ప్రకారం ఏది బెస్ట్​... ఏకాగ్రత పెరగాలంటే వర్క్​ రూం వాస్తు ఎలా ఉండాలి..  ప్రస్తుత కాలానికి సరిపోయేలా  వాస్తు ప్రకారం  ఏ దిక్కులో ఉన్న గోడకు ఎలాంటి రంగు వేయాలి.  మొదలగు  పూర్తి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..


పూర్వకాలంలో ఇళ్లను గానుగ సున్నం.. మట్టి ఇటుకలతో నిర్మించేవారు.  అదే మట్టి గోడలైతే వెదురుతో తయారు చేసి మట్టిని మందంగా అలికేవారు.  చాలా చల్లగా ఉండేవి. గోడల నిర్మాణానికి సున్నం, మట్టి వాడకం వలన ఇంటి లోపల గాలి శుద్ది అవుతుంది.  గాలిని శుద్ది చేసే పవర్​ సిమెంట్​ కు ఉండదు.  అయితే ఇప్పుడు ఆధునిక యుగంలో మట్టి గోడలు.. గానుగ సున్నంతో నిర్మించే గోడలు ఎక్కడా కనపడటం లేదు.  చాలామంది సిమెంట్​ ఇటుకలు వాడుతున్నారు.  సిమెంట్​ కు వాస్తు శాస్త్రం ప్రకారం వాయువును  ( గాలిని) శుద్ది చేసే బలం ఉండదు.  అందుకే  కనీసం మట్టి ఇటుకలతోనైనా ఇంటి గోడలను నిర్మించాలని వాస్తు పండితులు చెబుతున్నారు.  మట్టికి.. సున్నానిని గాలిని శుద్ది చేసే శక్తి ఉందని సైంటిఫిక్​ గా శాస్త్రవేత్తలు రుజువుచేశారు. 

ప్రస్తుతం ఆధునిక యుగంలో దాదాపు వర్క్​ స్టైల్​ అంతా డిజిటల్​సిస్టమ్​.. రిమోట్​తోనే చేస్తున్నారు.  అందుకే ప్రతి ఇంట్లో కూడా ఆఫీస్​ రూంను ఏర్పాటు చేసుకోవడమో.. లేదా వర్క్​ స్పేస్​ ను కేటాయించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి డెస్క్​ను నైరుతి దిక్కులో ఫేసింగ్​  ఉత్తరం  లేదాతూర్పు దిక్కుల్లో ఉండేలా వర్క్​ ప్లేస్​ను సెట్​ చేసుకోవాలి. దీని వలన చేస్తున్న ఏకాగ్రత పెరగడమే కాకుండా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.  మరో ముఖ్య విషయం ఏంటంటే.. వెనుక భాగంలో కిటికిగాని.. తలుపుగాని ఉండకూడదు.  పట్టష్టమైన గోడ ఉండాలని వాస్తు సిద్దాంతులు చెబుతున్నారు. 

దిశల దోషాలను సరిదిద్దడానికి ఇప్పుడు గోడలకు వేసే రంగులను వాడుతున్నారు. ఉత్తరంలో లోపం ఉంటే లేత నీలం, తూర్పులో లోపం ఉంటే ఆకుపచ్చ రంగులను వాడటం ద్వారా సానుకూలతను పెంచవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు.