మీ బండి నంబర్ మీ అదృష్టాన్ని మార్చేస్తుందా ? న్యూమరాలజీ ఏం చెబుతోందంటే.. ?

మీ బండి నంబర్ మీ అదృష్టాన్ని మార్చేస్తుందా ? న్యూమరాలజీ ఏం చెబుతోందంటే.. ?

సొంత  కారు లేదా బైక్ కొనడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. దీని కోసం ఎంతో కష్టపడి, రూపాయి రూపాయి దాచుకుంటాం. అయితే, కొత్త వాహనం కొనేటప్పుడు చాలామంది మైలేజ్, ధర, మోడల్స్ మాత్రమే చూస్తారు కానీ.. దానికి వచ్చే రిజిస్ట్రేషన్ నంబర్ గురించి పెద్దగా పట్టించుకోరు.

న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) ప్రకారం, మీ వాహనం నంబర్ మీ అదృష్టాన్ని, మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే కొత్త వాహనం కొనేటప్పుడు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోండి.

ఏ రోజుల్లో వాహనం కొనకూడదంటే 
శనివారం వద్దు: వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శనివారం రోజు కొత్త వాహనం కొనకూడదు. శనివారం అనేది శనిదేవుని రోజు. ఈ రోజున ఇనుముతో చేసిన వస్తువులను కొనడం అశుభంగా భావిస్తారు.

ఈ తేదీలు వద్దు: ఏ నెలలోనైనా సరే 8, 17, 26 తేదీలలో కొత్త వాహనాన్ని అస్సలు కొనకండి.

మీ వాహనం నంబర్లను కలిపితే మొత్తం ఎంత ఉండాలంటే 
మీ బండి నంబర్లన్నింటినీ కూడితే (టోటల్ చేస్తే) వచ్చే సింగిల్ డిజిట్ నంబర్ మీ అదృష్టాన్ని డిసైడ్ చేస్తుంది.

మీ వాహనం నంబర్ల మొత్తం 1, 2, 3, 5, లేదా 6 వస్తే అది చాలా మంచిది. ఇది మీకు కలిసి వస్తుంది. ఈ సంఖ్యలు శుభప్రదమైన సంఖ్యలు అంటే అదృష్టం తెచ్చేవి. 

అశుభప్రదమైన సంఖ్యలు (దూరంగా పెట్టాల్సినవి): వాహనం నంబర్ల మొత్తం 4, 8, లేదా 9 వస్తే అది మంచిది కాదు.

ఈ నంబర్లు ఎందుకు వద్దంటారంటే 
నంబర్ 4:
ఈ నంబర్ రాహువుకు సంబంధించిన సంఖ్య. దీనివల్ల బండి ప్రతిసారి  రిపేర్లకు రావడం లేదా ప్రమాదాలు జరగడం లాంటివి అవ్వచ్చు.

నంబర్ 8: ఈ నంబర్  శని గ్రహానికి సంబంధించిన సంఖ్య. బండి నంబర్ టోటల్ 8 వస్తే.. పోలీస్ చలానాలు, కోర్టు గొడవలు లాంటి చట్టపరమైన ఇబ్బందులు లేదా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. కొత్త బండి కొనేటప్పుడు మీకు నచ్చిన అదృష్ట సంఖ్య  వచ్చేలా ప్లాన్ చేసుకోవడం మంచిది. 

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.