V6 News

హైదరాబాద్లో పని మనుషులతో జాగ్రత్త.. జూబ్లీహిల్స్లో రూ.19 లక్షలు చోరీ !

హైదరాబాద్లో పని మనుషులతో జాగ్రత్త.. జూబ్లీహిల్స్లో రూ.19 లక్షలు చోరీ !

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ లో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో నివసించే వ్యాపారవేత్త అజయ్ కుమార్ ఇంట్లో బోరబండకు చెందిన అనూష, శైలజ అనే ఇద్దరు మహిళలు కొంతకాలంగా పని చేస్తున్నారు.

యజమానులు ఇంట్లో లేని సమయం చూసి అలమరాలో భద్రపరిచిన రూ. 19 లక్షలను ఎత్తుకెళ్లారు. డబ్బులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు పనిమనుషులు అనూష, శైలజలను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో నిందితులను రిమాండ్​కు తరలించారు.