Vastu tips: ఇంట్లో పార్కింగ్.. వరండా ఏ దిక్కులో ఉండాలి.. రెండు కిచెన్లు ఉంటు నష్టం కలుగుతుందా..!

Vastu tips: ఇంట్లో పార్కింగ్.. వరండా ఏ దిక్కులో ఉండాలి.. రెండు కిచెన్లు ఉంటు నష్టం కలుగుతుందా..!

చాలా మందికి సొంతిల్లు ఒక కల.  అయితే ఉన్నంతలో ఇల్లు కట్టుకోవాలని అందరూ అనుకుంటారు.   ఇంటికా పార్కింగ్​ విషయంలో.. వరండా నిర్మాణంలో  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.  ఒకే ఇంట్లో రెండు కిచెన్​ లు ఉంటే నష్టం ఉంటుందా.. మొదలగు విషయాల గురించి  వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ ( 9440088799) గారి సలహాలను ఒకసారి చూద్దాం

ప్రశ్న: మేము ఉన్న ఇల్లు రోడ్డు పక్కన ఉంది. ఇంటి ఫేసింగ్ పడమరలో ఉంది. ఇంటికి సెల్లార్ లేదు. ఒకవేళ పార్కింగ్ ఏర్పాటుచేసుకుంటే ఏ వైపు ఉండాలి.

జవాబు:  పెద్ద పెద్ద అపార్ట్​ మెంట్స్, బిల్డింగ్స్​ లో  మాత్రమే సెల్లార్స్ ఉంటాయి. దాన్నే పార్కింగ్ కు వాడతారు. ఇండిపెండెంట్ ఇళ్లకు ఆ అవకాశం ఉండదు. కాబట్టి ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే, పార్కింగ్​ కు వాడుకోవచ్చు. తూర్పు... ఉత్తరం దిక్కులు మాత్రమే పార్కింగ్ ప్లేస్​ కు  అనువైనవి.

ప్రశ్న:  ఈ మధ్యనే కొత్త ఇల్లు కట్టుకున్నం. ఇంటి ముందు అరుగు కట్టుకుంటే బాగుంటుందని బంధువులు చెప్పారు. ఒకవేళ కడితే ఏ దిక్కులో ఉండాలి?

జవాబు:  అరుగు ఉన్నా లేకున్నా ఇబ్బందులు ఏమీ ఉండవు.. పూర్వకాలంలో చాలామంది ఇళ్ల ముందు అరుగులు కట్టుకునేవాళ్లు. సాయంత్రం పూట సేదతీరడానికి అరుగు మీదికి చేరేవాళ్లు. అంతే తప్ప వాస్తుపరంగా అరుగు కట్టుకోవాలనే నియమం ఏమీ లేదు. ఒకవేళ కడితే దక్షిణం. ....పడమర దిక్కులో కట్టాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.

ప్రశ్న:  ఐదేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నం. ఇంటి ఫేసింగ్ ఉత్తరం వైపు ఉంది. కిచెన్ ఆగ్నేయంలో ఉంది. ఇంట్లో మరో కిచెన్ పెట్టాలనుకుంటున్నం. ఒకే ఇంట్లో రెండు కిచెన్లు పెట్టొచ్చా? పెడితే ఏ దిక్కులో ఉండాలి?

జవాబు: ఒకే ఇంట్లో రెండు కిచెన్లు పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇల్లు రెండు భాగాలుగా ఉంటే రెండు కిచెన్లు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం కొంతమంది రెండు కిచెన్లను వాడుతున్నారు. ఒకటి డ్రై. ఇంకోటి వెట్ కిచెన్ అంటున్నారు. దానివల్ల వాస్తు పరమైన ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఇప్పటికే ఉన్న కిచెన్ పక్కనే, మరో కిచెన్ ఏర్పాటుచేసుకుంటే బాగుంటుందని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ అంటున్నారు.