హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్, అమెరికా మధ్యా చర్చలు జరగనున్న క్రమంలో మిడిల్ ఈస్ట్ లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దుబాయ్ లోని వాణిజ్యానికి కీలకమైన జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్టు వస్తున్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ దాడులు హౌతీలు చేసినట్లు సమాచారం..అయితే ఈ దాడిపై యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.
జెబెల్ అలీ ప్రాంతంలో భారీగా మంటలు, దట్టమైన పొగలు కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయని తెలుస్తోంది.
జెబెల్ అలీ ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ సరుకు రవాణాలో జెబెల్ అలీ పోర్టు కీలకం. ఈ ప్రాంతంలో దాడులు జరగడం గల్ఫ్ ప్రాంత వాణిజ్య కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా, ఇరాన్ మధ్య ఇవాళ(ఆగస్టు5) చర్చలు, ఒప్పందం కుదిరుతుందని భావిస్తున్న సమయంలో ఈ దాడులు మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పెంచాయి.
