Arjun Tendulkar: ఐపీఎల్ లో తొలి వికెట్ తీసిన అర్జున్ టెండుల్కర్

Arjun Tendulkar: ఐపీఎల్ లో తొలి వికెట్ తీసిన అర్జున్ టెండుల్కర్

అర్జున్ టెండుల్కర్ సచిన్ కోడుకు కావడంతో అతడిపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే.    ముంబై ఇండియన్స్ గత సీజన్ లో  కొనుగోలు చేసినా అతడిని ఒక్క మ్యాచ్  ఆడించలేదు.  అయితే   ఈ సారి  అర్జున్ టెండుల్కర్ ను  బరిలోకి దించింది. ఏప్రిల్ 16న కోల్ కతాతో జరిగిన మొదటి మ్యాచ్ లో అర్జున్ కు వికెట్ దక్కలేదు. కానీ ఏప్రిల్ 18న ఉప్పల్ లో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్జున్ టెండుల్కర్ తన మొదటి ఐపీఎల్ వికెట్ ను తీశాడు.  

పవర్ ప్లేలో అర్జున్ రెండు ఓవర్లు వేసి 14 పరుగులిచ్చాడు కానీ వికెట్ దక్కలేదు. లాస్ట్ ఓవర్లో సన్ రైజర్స్ 20 పరుగులు చేయాలి. ఈ సమయంలో   రోహిత్ శర్మ  20 వ ఓవర్ ను అర్జున్ కు ఇచ్చాడు. 20 వ ఓవర్ వేసిన అర్జున్ 19.5 వద్ద భువనేశ్వర్ కుమార్ ను ఔట్ చేయడంతో తొలి వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 20 పరుగులు చేయాల్సిన సన్ రైజర్స్ 14 పరుగుల తేడాతో ఓడిపోయింది.

అర్జున్ తొలి వికెట్ తీయడంతో  కాసేపు గ్రౌండ్ లో అర్జున్ అర్జున్ అంటూ అరుపులు కేకలు వినిపించాయి.  మ్యాచ్ అనంతరం  అర్జున్ కు టీమ్ మేట్స్ అంతా కంగ్రాట్స్ చెప్పారు. డ్రెస్సింగ్ రూంలో కూడా అర్జున్ టెండుల్కర్ తో కేక్ కట్ చేయించారు టీమ్ మేట్స్ .

https://twitter.com/IPL/status/1648386251387727877