
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెఫ్ అవతారం ఎత్తారు. ఢిల్లీలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఇద్దరు నేతలు వంటలో బిజీ అయిపోయారు. మంటన్ ఎలా వండాలి. అందులో మసాలా ఎంత వేయాలో లాలూ చెబుతుంటే..రాహుల్ గాంధీ వండేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ రిలీజ్ చేశారు.
తనకు వంట చేయడం వచ్చునని కానీ అందులో ఎక్స్ పర్ట్ ను కాదంటూ రాహుల్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. తాను యూరప్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు వంట నేర్చుకోవలసి వచ్చిందన్నారు. . చిన్న చిన్న వంటకాలను తాను చేయగలనని చెప్పిన రాహుల్.. ఎక్స్‌పర్ట్ మాత్రం కాదని, లాలూ మాత్రం అద్భుతంగా వంట చేస్తారని చెప్పుకొచ్చారు.
అనంతరం ఇద్దరు కలిసి చక్కగా తినేసి ముచ్చట్లో మునిగిపోయారు. వీరితో పాటుగా బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఆయన సోదరి మిసా భారతి కూడా ఉన్నారు. తిరిగి రాహుల్ తన ఇంటికి వెళ్లేముందు తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కోసం మటన్ డిష్‌ను ప్యాక్ చేసి తీసుకువెళ్లారు.