లక్ష్యదీప్ టూర్ వెళ్లానుకుంటున్నారా. .ఎలా వెళ్లాలి, బెస్ట్ ట్రావెలింగ్ ప్లాన్స్ ఇవిగో..

లక్ష్యదీప్ టూర్ వెళ్లానుకుంటున్నారా. .ఎలా వెళ్లాలి, బెస్ట్ ట్రావెలింగ్ ప్లాన్స్ ఇవిగో..

లక్ష ద్వీప్ దీవులు భారతదేశంలోని అత్యంత సుందరమైన, ప్రశాంతమైన ప్రదేశాలలో అతి తక్కువగా సందర్శించబడిన వాటిలో ఒకటి. లక్ష ద్వీప్ లో మొత్తం 36 ఐస్ లాండ్స్ ఉంటాయి. 12 ఆటోల్స్, మూడు దిబ్బలు ఉంటాయి. వీటిలో కేవలం 10 ద్వీపాలకు మాత్రమే మనం ప్రయాణించగలం. మీరు అత్యంత సహజమైన, రద్దీ నగరాలకు దూరంగా సెలవులను ఎంజాయ్ చేయాలనుకునేవారు లక్ష ద్వాప్ కు వెళితే తప్పకుండా ఎంజాయ చేస్తారు.

లక్ష ద్వీప్ దీవులలోని 30 ద్వీపాలలో కేవలం 10 మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. మినీకాయ్ ద్వీపం, కల్పేని దీవులు, కద్మత్ దీవులు, బంగారం ద్వీపం, తిన్నకర ద్వీపం వంటివి ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు. 

లక్షద్వీప్ ఎలా చేరుకుకోవాలి..

పర్యాటకులు కేరళలోని కొచ్చి మీదుగా లక్ష ద్వీప్ దీవులనుచేరుకోవచ్చు. కొచ్చి నుంచి విమానాలు, నౌకలు ఉంటాయి. ఎయిర్ ఇండియా వారానికి ఆరు రోజులు  లక్ష ద్వీప్ కు విమానాలను నడుపుతోంది. 

లక్షద్వీప్ లోకి ప్రవేశం 

లక్ష ద్వీప్ లోకి ప్రవేశించడం నిషేధించబడింది. కొచ్చిలో ఉన్న లక్ష ద్వీప్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన అనుమతి అవసరం. అనుమతిని పొందేందుకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిని మీరు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి క్లియర్ చేయాల్సి ఉంటుంది. క్లియరెన్స్ సర్టిఫికెట్ తర్వాత ఎంట్రీ పాస్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. లేదా కొచ్చిలోని విల్లింగ్ డన్ ఐలాండ్ లో ఉన్న లక్ష ద్వాప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి వ్యక్తిగతంగా పొందాలి. లక్ష ద్వీప్ కు చేరుకున్నత తర్వాత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కి సమర్పించాలి. ప్రయాణంలో మీ వెంట తక్కువ లగేజీ ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ చిన్న విమానాలు మాత్రమే ఉంటాయి. 

లక్షద్వీప్ కు ఇలా కూడా వెళ్లొచ్చు.. 

mv కవర్తి, mv మినీకాయ్, mv అమిండివి, mv కోరల్స్, mv లగూన్, mv  లక్షద్వీప్ సముద్రం, mv  అరేబియన్ సముద్రం అనే ఏడు నౌకలు కొచ్చి నుంచి లక్ష ద్వీప్ కు వెళ్తాయి. 

సో.. ఎంజాయ్ ది లక్షద్వీప్ టూర్..