బిగ్ బాస్ సీజన్ 7 కోసం భారీ మార్పులు.. హోస్ట్ కూడా?

బిగ్ బాస్ సీజన్ 7 కోసం భారీ మార్పులు.. హోస్ట్ కూడా?

ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షోకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. హిందీలో 14  సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ షో  తెలుగులో ఆరు సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే.. తెలుగులో ఐదు సీజన్ ల వరకు బాగానే సాగిన బిగ్ బాస్ ప్రయాణం..  6వ సీజన్ మాత్రం ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయింది. సీజన్ 6 ఫైనల్ ఎపిసోడ్ కూడా ఆడియన్స్ కి అంతగా మజా ఇవ్వలేదు. ఇక ఈ 6 సీజన్స్ తో పాటు.. ఓటీటీలో ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా టెలికాస్ట్ అయ్యింది. సీజన్స్ హిట్, ఫ్లాప్స్ సంగతి ఎలా ఉన్నా.. కొత్త సీజన్ కోసం ఆడియన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు కూడా బిగ్ బాస్ 7వ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కానీ సీజన్ 7 కోసం భారీ మార్పులు చేయనున్నారట షో నిర్వాహకులు. ఇక బిగ్ బాస్ తో స్టార్ మా అగ్రిమెంట్ కూడా లాస్ట్ సీజన్ తోనే పూర్తయిందని టాక్.  సీజన్ 7 కి కొత్త అగ్రిమెంట్ చేయించుకోవాల్సి ఉందట. ఈ క్రమంలోనే స్టార్ మా నుండి బిగ్ బాస్ షో బయటకు వచ్చేస్తుందనే  వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే.. ఈ న్యూస్ పైన అధికారిక ప్రకటన అయితే ఏమి రాలేదు. నిజానికి..  బిగ్ బాస్ అంటే స్టార్ మా.. స్టార్ మా అంటే బిగ్ బాస్ అని ఆడియన్స్ మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఇలాంటి సమయంలో షో కొత్త సీజన్ కోసం వేరే చానల్ ని  సంప్రదిస్తే ఆడియన్స్ దానికి ట్యూన్ అవుతారా అనే అనుమానంలో కూడా యాజమాన్యం ఉందట. ఒకవేళ మా టీవీలోనే షో కంటిన్యూ చేస్తే మళ్ళీ కొత్త అగ్రిమెంట్ చేస్కోవాల్సి ఉంటుంది. కొత్త అగ్రిమెంట్లో పేమెంట్ విషయంలో కూడా కొత్త రూల్స్ పెట్టనుందట మా. అంతేకాదు అగ్రిమెంట్ కూడా ఐదేళ్లు పదేళ్లు కాకుండా లాంగ్ టైం చేసుకోవాలని అనుకుంటున్నారట.

ఈ సీజన్  కోసం స్టార్ కపుల్స్ ని తీసుకొనున్నారట. అంతేకాదు కంటెస్టంట్స్ విషయంలో కూడా భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సెలబ్రిటీస్ ని తీసుకుంటున్నారని టాక్. సీజన్ 7 లొకేషన్ కూడా హైదరాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ చేస్తున్నారని సమాచారం. మరి ఇన్ని కొత్త మార్పులతో రానున్న ఈ సీజన్ ఆడియన్స్ ని ఎంత వరకు మెప్పిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.