రూ.90 లక్షలకు పడిపోయిన ఆదిపురుష్ కలెక్షన్స్

రూ.90 లక్షలకు పడిపోయిన ఆదిపురుష్ కలెక్షన్స్

ఆదిపురుష్(Adipurush) సినిమా కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. తాజాగా సమాచారం ప్రకారం విడుదలైన 14వ రోజు ఈ సినిమా కేవలం 90 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ ఆదిపురుష్ మూవీ.. భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. విడుదలైన రోజునుండే ఈ సినిమాపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. సినిమాలో సన్నివేశాలు, సంభాషణలు, పాత్రలు, పాత్రల చిత్రీకరణ వంటి విషయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఈక్రమంలో సినిమాను నిలిపివేయాలని కోర్టులో పిటీషన్ కూడా దాఖలైంది. 

దీంతో ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడింది. ఈ సినిమా మొదటి రోజు ఏకాంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకు.. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని అందురు భావించారు. కానీ ఈ సినిమాకు అనూహ్యంగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

ఇక తాజా రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 14వ రోజు కేవలం 90 లక్షలు మాత్రమే రాబట్టిందట. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.291.98 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ సత్య ప్రేమ్ కి కథ సినిమా గట్టి పోటీ ఇస్తోంది. సత్యప్రేమ్ కి కథ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తోంది.