న్యూ ఇయర్ వేడుకల్లో బీర్లకు మస్త్ గిరాకీ

న్యూ ఇయర్ వేడుకల్లో బీర్లకు మస్త్ గిరాకీ

రేపు రాత్రి జరిగే న్యూ ఇయర్ వేడుకల కోసం ఈవెంట్ ఆర్గనైజర్స్ భారీ ఏర్పాట్లు చేశారు. వెయ్యికి పైగా బార్ అండ్ రెస్టారెంట్లు లిక్కర్ స్టాక్‭ను పెట్టుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్ షాపులు ఉన్నాయి. రోజు వారి కంటే పండగలు, స్పెషల్ ఈవెంట్స్ ఉన్న సమయాల్లోనే లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతాయి. అయితే ఈ ఏడాది రేపే చివరి రోజు కావడంతో.. ఇప్పటికే అమ్మకాలు జోరందుకున్నాయి. మరోవైపు గోడౌన్స్ నుంచి వైన్స్, రెస్టారెంట్లకు లిక్కర్‭ను తరలిస్తున్నారు. 

ఈఏడాది బీర్ సేల్స్ ఎక్కువగా ఉంటుందని లిక్కర్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు ధరల వ్యత్యాసం వల్ల కూడా బీర్‭కు గిరాకీ ఎక్కువగా ఉంటుందంటున్నారు. అన్ లిమిటెడ్ లిక్కర్‭తో ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. మరోవైపు న్యూఇయర్ ఈవెంట్స్ పై తెలంగాణ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అర్థరాత్రి ఒంటిగంట వరకే వేడుకలకు పర్మిషన్ ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.