ఆదిలాబాద్ జిల్లా గుడిహథ్నూర్ హైవేపై భారీ ట్రాపిక్ జామ్... ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు..

ఆదిలాబాద్ జిల్లా గుడిహథ్నూర్ హైవేపై భారీ ట్రాపిక్ జామ్... ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు..

ఆదిలాబాద్ జిల్లాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం ( జులై 4 ) ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ జాతీయరహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు.

హైవే దగ్గర సర్వీసు రోడ్డు నిర్మాణం కారణంగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నయంగా ఏర్పాటు చేసి దారి ఇరుకుగా ఉండటం, గుంతలు ఉండటంతో ముందుకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఈ క్రమంలో ఆదిలాబాద్, మహారాష్ట్ర వైపు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు వాహనదారులు.