హైదరాబాద్ కౌలాలంపూర్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం... శంషాబాద్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ అవుతుండగా....

హైదరాబాద్ కౌలాలంపూర్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం... శంషాబాద్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ అవుతుండగా....

హైదరాబాద్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. శనివారం ( జులై 4 ) శంషాబాద్ ఎయిర్ పోర్టులో హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన విమానం టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు.

పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికే విమానం ఎక్కిన 150 మంది ప్రయాణికులను సురక్షితంగా దింపారు. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు.

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎయిర్పోర్ట్ కి దగ్గర్లోని హోటళ్లలో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు అధికారులు. విమానంలో సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.