Cinema Mystery: సినిమాకు ఆత్మల శాపం తగిలిందా?

Cinema Mystery: సినిమాకు ఆత్మల శాపం తగిలిందా?

సినిమా (CINEMA) అంటే ఒక క్రియేషన్, లేనిది ఉన్నట్లు తెరపై చూపించే ఒక మాయ. 9 మాయాజాలంలో ఒక్కోసారి నిజాన్ని కూడా చూపిస్తుంటారు. కాకపోతే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఫిక్షన్ జోడిస్తుంటారు. అయితే సినిమాలందు హారర్ సినిమాలు వేరు. మూవీ వరల్డ్ ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురి చేసే కథలు ఎన్నో వచ్చాయి. అలాంటిదే ‘పోల్టర్ గైస్ట్’ (Poltergeist) మరో వందేళ్లైనా నిలిచిపోవడం ఖాయం. ఆడియెన్స్ను అంతలా భయపెట్టింది ఆ హారర్ సినిమా. ఆ సినిమా గురించి అల్లుకున్న కథలు ఆ భయాన్ని మరింతగా మార్చేశాయి. పోల్టర్‌ గైస్ట్ (Poltergeist) అనేది జర్మన్ భాష నుండి వచ్చిన పదం. దీని అర్థం ‘సవ్వడి చేసే దెయ్యం’ లేదా ‘అల్లరి చేసే ఆత్మ’.

పోల్టర్‌గైస్ట్:

1982లో రిలీజ్‌ అయిన హాలీవుడ్‌ హారర్‌ థ్రిల్లర్‌. టోబ్ హూపర్‌ (Tobe Hooper) ఈ సినిమాకు డైరెక్టర్‌. అయితే, ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg) ఈ సినిమాకు స్టోరీ రాయడంతో పాటు ప్రొడ్యూసర్‌ కూడా. శ్మశానం మీద కట్టిన ఇల్లు అని తెలియక ఒక కుటుంబం దానిని కొనుగోలు చేస్తుంది. అందులోకి వెళ్లాక ఆ ఫ్యామిలీకి భయంకరమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రేతాత్మల లీడర్‌ ఆ ఇంట్లో వాళ్లను దారుణంగా హింసిస్తుంటాడు.

ఆ దెయ్యాల నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడిందనేదే మిగతా స్టోరీ. ‘They're Here’ అని చిన్నపిల్ల వాయిస్‌తో వచ్చే డైలాగ్‌ ఈ సినిమాకు చాలా ఫేమస్‌. పోల్టర్‌గైస్ట్‌ను టీవీలో వేస్తే జనాలు చూడరని, వ్యూయర్‌షిప్ సరిగా రాదని చెబుతారు. ఓటీటీలోనూ ఈ సినిమాను చూసేవాళ్లు చాలా తక్కువ. వీసీఆర్‌లు, డీవీడీలు, డిజిటల్ ప్రింట్లు కూడా ఎక్కువగా అమ్ముడుపోలేదని అంటారు. ఎందుకంటే ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ అలాంటిది.

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో విచిత్రమైన సంఘటనలు జరిగాయని ప్రచారం ఉంది. అంతేకాదు, సినిమాకు పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లు రకరకాల కారణాలతో మరణించారని చెబుతారు. అయితే ఈ సినిమా కోసం నిజమైన అస్థిపంజరాలను.. వాడటం వల్లే దెయ్యాల శాపం తగిలిందట. ఆ కారణంతోనే వాళ్లంతా చనిపోయారనే ప్రచారం ఇప్పటికీ వినిపిస్తుంటుంది. అందుకే పోల్టర్‌గైస్ట్ హాలీవుడ్‌లో ‘కర్స్‌డ్‌’ (శాపం తగిలిన) మూవీగా పేరు మిగిలింది.

ఆ దెయ్యాల నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడిందనేదే మిగతా స్టోరీ. ‘They're Here’ అని చిన్నపిల్ల వాయిస్‌తో వచ్చే డైలాగ్‌ ఈ సినిమాకు చాలా ఫేమస్‌. పోల్టర్‌గైస్ట్‌ను టీవీలో వేస్తే జనాలు చూడరని, వ్యూయర్‌షిప్ సరిగా రాదని చెబుతారు. ఓటీటీలోనూ ఈ సినిమాను చూసేవాళ్లు చాలా తక్కువ. వీసీఆర్‌లు, డీవీడీలు, డిజిటల్ ప్రింట్లు కూడా ఎక్కువగా అమ్ముడుపోలేదని అంటారు. ఎందుకంటే ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ అలాంటిది.

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో విచిత్రమైన సంఘటనలు జరిగాయని ప్రచారం ఉంది. అంతేకాదు, సినిమాకు పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లు రకరకాల కారణాలతో మరణించారని చెబుతారు. అయితే ఈ సినిమా కోసం నిజమైన అస్థిపంజరాలను.. వాడటం వల్లే దెయ్యాల శాపం తగిలిందట. ఆ కారణంతోనే వాళ్లంతా చనిపోయారనే ప్రచారం ఇప్పటికీ వినిపిస్తుంటుంది. అందుకే పోల్టర్‌గైస్ట్ హాలీవుడ్‌లో ‘కర్స్‌డ్‌’ (శాపం తగిలిన) మూవీగా పేరు మిగిలింది.

ఆ నలుగురి మరణం.. 

హెదర్‌ ఓ'రూర్కే.. అరడజను సినిమాలు, పది టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న చైల్డ్ ఆర్టిస్ట్‌. పోల్టర్‌గైస్ట్ ఫ్రాంచైజీలో మూడు సినిమాల్లోనూ ‘కరోల్ ఆన్ ఫ్రీలింగ్‌’ రోల్ చేసింది హెదర్‌. కానీ, మూడో పార్ట్ షూటింగ్ మధ్యలోనే ఆ చిన్నారి అనారోగ్యం పాలైంది. ఉన్నట్లుండి పొత్తికడుపు నొప్పితో కుప్పకూలిపోగా హాస్పిటల్‌కు తరలించారు. సర్జరీ చేస్తుండగా సెప్టిక్ షాక్‌తో చనిపోయింది హెదర్‌. పన్నెండేళ్ల వయసుకే ఆ చిన్నారి చనిపోవడం హాలీవుడ్‌లో విషాదం నింపింది.

రెండో మరణం.. కరోల్‌కు సిస్టర్ రోల్‌లో యాక్ట్ చేసిన నటి డొమినిక్ డన్నే. టీనేజ్ యాక్ట్రెస్‌గా అప్పటికే చాలా టీవీ షోల్లో కనిపించిన డొమినిక్‌కు పోల్టర్‌గైస్ట్ డెబ్యూ మూవీ. కానీ, సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్లకే బాయ్‌ఫ్రెండ్ చేతిలో దారుణంగా దాడికి గురైంది. ఐదు రోజులపాటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుని బతుకుతుందన్న దశ నుంచి సడన్‌గా చనిపోయింది.

మూడో మరణం.. జులియన్ బెక్‌. పోల్టర్‌గైస్ట్లో కరోల్‌ని వెంటాడే ఆత్మ పాత్రలో ఈయన నటించాడు. సీక్వెల్‌లో నెగెటివ్ ఘోస్ట్ రోల్‌లో యాక్ట్ చేసినప్పటికీ, ఆ సినిమా రిలీజ్ కాకముందే క్యాన్సర్‌తో కన్నుమూశాడు. అప్పటికి ఆయన వయసు 60 ఏళ్లు.

ఇక నాలుగో మరణం... విల్ సాంప్సన్‌. ఈ మూవీలో టేలర్ పాత్రలో నటించాడు. సడన్‌గా అనారోగ్యానికి గురై 1987లో సాంప్సన్ కూడా చనిపోయాడు. ఈ నలుగురికి ఉన్న కామన్ లింక్ పోల్టర్‌గైస్ట్ మూవీ. అందులో చిన్నారి హెదర్ ఓ'రూర్కే చేసిన కరోల్ క్యారెక్టర్‌తో ఎక్కువసేపు స్క్రీన్ షేర్ చేసుకోవడం.

నో.. లియాక్షన్!

డేనియల్ ఎడ్మండ్, రిచర్డ్ చేసిన అనేకాల్లోని స్పెషల్ ముండి గానీ, బ్రయన్ డేవిడ్ స్లాగ్ గానీ, ఎంటిమ్ స్ట్రోక్ గానీ, సినిమాకు పని చేసిన ఏ ఒక్క టెక్నీషియన్ ముందుగానీ ఎలాంటి రియాక్షన్ రాలేదు. మెగా భాగ్యం పెద్దగా ట్రైలర్ క్రెడిట్స్ ముందు రీల్‌యూజ్‌లో అనుమానాలు మొదలయ్యాయి. పోలర్ ఓరూర్కే చనిపోయిన నాలుగు నెలలకు ఈ మూవీ సీక్వెల్ మూవీకి షూటింగ్ మొదలైంది. కానీ, ప్రమోషన్ పెద్దగా లేకుండానే షూటింగ్ ఎంటిమ్ స్ట్రోక్ హోటల్. అది కూడా హారర్ రోల్ గురించి ప్రశ్నలు అడిగినప్పుడు కండిషన్ పడినట్లు అనుమతించిందని.

మరీగా ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో పోల్టర్‌గైస్ట్ పార్ట్ మూవి బ్రయన్ చెప్పిన స్టేట్‌మెంట్ సగం కామెడీగా దారి తీసింది. పోల్టర్‌గైస్ట్ ఆత్మలంతా ఏదో ఒక రీజన్‌తోనే చనిపోయారు కదా. రియల్‌గా వాళ్లను చంపేయడం ఎవరికైనా జరుగుతుందా?" అని వ్యాఖ్యించాడు. దీంతో రూమర్లు మొదలయ్యాయి. టీమ్ వెనడిట్ భయాలతో వణికిపోయారు. అయినా కూడా ఈ జన్మనే స్పీల్‌బర్గ్ ఈచా డిట్ వరకు ఎప్పుడూ విసిగిపోలేదు.

స్కెలిటన్ వల్లనేనా?

2002లో ‘కర్ల్ ఆఫ్ పోల్టర్‌గైస్ట్’ డాక్యుమెంటరీ అనే ఒక డాక్యుమెంటరీ విడుదలైంది. అందులో కలకలం రేపింది. పోల్టర్‌గైస్ట్‌లో ఓల్డ్ రోల్ట్ డెవిల్‌గా నటించిన నటుడు టేలర్ ఎప్పుడూ ఉన్నట్లుండి ప్రేతమంతా తనతో మాట్లాడుతున్నారని చాలా చెప్పేవాడు. సినిమాలో ఒక సీన్‌లో కనిపించే అస్థిపంజరాన్ని యూఎస్‌లోని ఒక పెద్ద హాస్పిటల్‌ నుంచి తీసుకొచ్చారని చెప్పారు. దీంతో అప్పటి వరకు పోల్టర్‌గైస్ట్ ఆర్టికల్స్‌ను మామూలు రూమర్స్‌గా తీసుకున్నవన్నీ వాస్తవాలుగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

2008లో మరో ఇంటర్వ్యూలోనూ ఆమె అదే విషయాన్ని మరింత డీటెయిల్‌గా చెప్పింది. ‘ఒక సీన్‌లో డెవిల్ క్యారెక్టర్ మా ఫ్యామిలీని స్విమ్మింగ్ పూల్‌లోకి లాగుతుంది. ఎదురుగా నిల్చిన ఆ పూల్‌లో అస్థిపంజరాలు ఉంటాయి. వాటి నుంచి నా పిల్లలను కాపాడుకోవడానికి పోరాడాలి. ఆ టైంలో ప్లాస్టిక్ స్కెలిటన్స్ చాలా రేర్ ఉండేవి. అందుకే స్మశానాల దగ్గర దొరికిన స్కెలిటన్స్‌ను’ తెప్పించారట. ఆ సీక్వెన్స్ షూట్ చేయడానికి ఐదారు రోజులు పట్టింది. ఆ తర్వాత ఒక టెక్నీషియన్ ‘రియల్ స్కెలిటన్స్ అయినా ధైర్యంగా షూట్ చేశారు మేడమ్’ అని భయంగా మాకు చెప్పాడు.

ఆ మాటలతో షాకయ్యా. స్పీల్‌బర్గ్‌ను కూడా విషయం పై నిలదీశా. కానీ, ఆయన నుంచి ఆన్సర్ లేదు. బహుశా ఆ ఆత్మల వల్లే కాస్ట్ మెంబర్స్‌ చనిపోయి ఉండొచ్చు. అంతెందుకు, ఈ సినిమా డైరెక్టర్‌ టోబ్‌ కూడా ఈ విషయాన్ని నమ్ముతారు” అంటూ చెప్పిందామె. అయితే మొదట్లో ఆమె మాటల్ని ఎవరూ నమ్మలేదు. కానీ, ఈ సినిమాకు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌గా పని చేసిన కాన్సన్‌ మాత్రం ఆ విషయాన్ని కన్ఫర్మ్‌ చేశాడు. అంతేకాదు ఈ సినిమాలోని రెండో పార్ట్‌ సెట్స్‌లో ఉన్నప్పుడు రాత్రిళ్లు నటుడు విల్‌ శాంప్సన్‌ రోజూ రాత్రిళ్లు ఎక్సార్సిజం (భూతవైద్యం) చేసేవాడని బాంబ్‌ పేల్చాడు కాన్సన్‌.

పోల్టర్‌గైస్ట్‌లో యాక్ట్‌ చేసిన వాళ్లు చనిపోవడం మాత్రమే కాదు.. సినిమా సెట్స్‌ మీద ఉండగానే కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయని కొందరు టెక్నీషియన్లు చెప్తుంటారు. అందుకే ఈ సినిమా ఫ్రాంచైజీలో మూడు సినిమాలు వచ్చాక ఆపేశారు. చాలాకాలం తర్వాత 2015లో గిల్‌ కెనెన్‌ అనే డైరెక్టర్‌ ‘పోల్టర్‌గైస్ట్‌’ రీబూట్‌ పేరుతో కొత్త వెర్షన్‌ను అందించారు. కర్స్‌ మూవీగా దీనికి ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ, ఈ సినిమాలో యాక్ట్‌ చేసిన వాళ్లకు ఏం కాలేదు.

అంతే కాదు, ఆ సినిమా పెద్దగా ఆడలేదు కూడా. అయితే పోల్టర్‌గైస్ట్‌ ఓల్డ్‌ వెర్షన్‌ శాపం గురించి మాత్రం ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. పోనీ, ఇదంతా పబ్లిసిటీ కోసం ఈ ప్రచారం చేశారా? అంటే అప్పటికే సినిమా బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. అలాంటప్పుడు రియల్‌ అస్థిపంజరాలు.. వాటి శాపం.. వాళ్లను బలిగొనడం?.. ఎంత వరకు నిజం. ఈ మిస్టరీ వీడాలంటే స్పీల్‌బర్గ్‌ నోరు విప్పాలి. ఆరోపణలు అబద్ధమని ప్రపంచానికి చెప్పాలి. అప్పటిదాకా అంతుచిక్కని కథల మిస్టరీ కొనసాగాల్సిందే.