
నల్గొండ మండలం బుద్ధారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్య రాములమ్మను రాడ్ తో కొట్టి చంపాడు భర్త శ్యామయ్య. భార్య చనిపోయిన తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.