V6 News

మద్యం తాగాడు.. భార్యతో గొడవపడ్డాడు.. తరువాత ఏంజరిగిందంటే..భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఘటన

మద్యం తాగాడు.. భార్యతో గొడవపడ్డాడు.. తరువాత ఏంజరిగిందంటే..భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఘటన

చండ్రుగొండ, వెలుగు: ఓ వ్యక్తి  భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంలో శనివారం జరిగింది. ఎస్సై శివరామకృష్ణ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొప్పి నాగరాజు కొన్నిరోజులుగా మద్యానికి బానిసై భార్య బొప్పి పున్నేశ్వరి (42)పై అనుమానంతో గొడవపడుతుండేవాడు. ఈనెల 21న మద్యం మత్తులో భార్యతో గొడవపడి కత్తితో పడిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. మృతురాలి అక్క చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై  తెలిపారు.