సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంలో మహిళ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. పోలీసుల విచారణ సంచలన విషయాలు బయటికొచ్చాయి. మహిళను హత్య చేసింది గుర్తు తెలియని వ్యక్తులు కాదు.. కట్టుకున్న భర్తే పోలీసులు తేల్చారు. హత్యకు గల కారణాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు. 20ఏళ్లుగా బొల్లారం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ జంట.. ఉన్నట్టుండి చంపుకునేంత దారుణ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేకోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతురాలు మీనా భర్త అనిల్ ను పోలీసులోకి తీసుకొని విచారిస్తున్నారు.
శనివారం రాత్రి బొల్లారం నిర్మానుష ప్రాంతంలో అదే ప్రాంతానికి చెందిన మీనా అనే మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి గొంతుకోసి చంపేశారని ఆమె భర్త అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అడ్డువెళ్లిన తనపై కత్తితో దాడి చేశారని పోలీసులకు తెలిపారు. కూరగాయాల మార్కెట్ వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
మృతురాలు మీనా భర్త అనిల్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. మీనాను చంపింది దుండగులు కాదు.. స్వయంగా కట్టుకున్న భర్తే హత్య చేశారన్న విషయం వెలుగు చూసింది. మీనా హత్య తర్వాత ఆమె భర్త అనిల్ పోలీసులకు చెప్పిన విషయాలు పొంతన లేనివిగా ఉండటంతో అనుమానం వచ్చింది. అనిల్ విచారించగా అసలు నిజం బయటికొచ్చింది.
►ALSO READ | ఖమ్మం జిల్లాలో గోల్డ్ పేరుతో మోసం.. తక్కువ ధరకు బంగారం అంటూ రూ.50లక్షలకు టోకరా
ఈ కేసులో మృతురాలు మీనా భర్తే హంతకుడని తేలడంతో హత్య కు గల కారణాలు వెదికే పనిలో పడ్డారు పోలీసులు. అనిల్ ని అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారిస్తున్నారు.
మీనా, అనిల్ దంపతులు గత 20 ఏళ్లుగా బొల్లారంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. వారిమధ్య ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఈమధ్యే కొత్త ఇల్లు కూడా కట్టుకున్నారు. ఉన్నట్టుంది మీనా హత్య జరగడంతో స్థానికంగా కలకలం రేపింది. మీనాను హత్య చేయాల్సిన అవసరం అనిల్ కు ఎందుకు వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అనిల్ విచారణలో హత్యకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులో రానున్నాయి.
