ఖమ్మం జిల్లాలో గోల్డ్ పేరుతో మోసం.. తక్కువ ధరకు బంగారం అంటూ రూ.50లక్షలకు టోకరా

ఖమ్మం జిల్లాలో గోల్డ్ పేరుతో మోసం.. తక్కువ ధరకు బంగారం అంటూ రూ.50లక్షలకు టోకరా

స్వామీజీనంటూ గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చాడు.. ప్రజలకు నమ్మకం కలిగించాడు. సొంత డబ్బులతో గ్రామంలో పండుగలు , జాతరలు నిర్వహించాడు. ఆ తర్వాత నిజం స్వరూపం చూపించాడు. గోల్డ్ పేరిట తండా ప్రజలను నమ్మించి 50 లక్షలకు కుచ్చు టోపి పెట్టిన ఓ కేటుగాడి లీలలు ఖమ్మం జిల్లా కమేపల్లిలో వెలుగు చూశాయి. వివరాల్లోకి వెళితే.. 

ఏపీలోని ఎన్టీఆర్  జిల్లా నంద్యాలకు చెందిన బోగా లక్ష్మీనారాయణ, ఖమ్మంజిల్లా కామేపల్లి మండలం భాసితనగర్ కు చెందని సాయికుమార్ తో కలిసి మంచి చెడు కోసం పూజలు నిర్వహిస్తామని కామేపల్లిలోకి ఎంట్రీ ఇచ్చారు.  కామేపల్లి పరిధిలోని కెప్టెన్ బంజారాకు చెందని కొంతమంది యువకులు అయ్యప్ప మాల వేయగా.. వారితో సదరు కేటుగాళ్లు లక్ష్మీనారాయణ, సాయికుమార్ పూజలు చేయించారు. అంతేకాడు బాసిత్ నగర్ లో అయ్యప్ప పూజలతో పాటు ముత్యాలమ్మ జాతర కూడా సొంత ఖర్చులతో నిర్వహించారు. కొసమెరుపు ఏంటంటే కామేపల్లి మండలంలోని లింగాల క్రాస్ రోడ్డు దగ్గర కోట మైసమ్మ గుడి కట్టించేందుకు స్థలాన్ని కూడా కొన్నారు. పక్కా ప్లాన్ తో గ్రామస్తులను నమ్మించేందుకు లక్ష్మీనారాయణ, సాయికుమార్ రంగం సిద్దం చేశారు. 

ప్రజల్లో నమ్మకం కలిగిన తర్వాత కేటుగాళ్లు లక్ష్మీనారాయణ , సాయికుమార్ లు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. తక్కువ ధకు బిస్కట్ బంగారం ఇస్తామని నమ్మించారు. గ్రామంలో తొమ్మిది నెలలుగా నమ్మకంగా ఉంటూ గ్రామంకోసం పూజలు, జాతరలు చేయడంతో ప్రజలు నమ్మి లక్షల డబ్బును ముట్టజెప్పారు. కెప్టెన్ బంజార , బాసిత్ నగర్  గ్రామాల్లో ప్రజలనుంచి 50 లక్షలకు పైగా వసూలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే కోటి రూపాయల దాక వసూలు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

తమప్లాన్ సక్సెస్ కావడంతో  గ్రామస్తుల డబ్బుతో నిందితులు లక్ష్మీనారాయణ, సాయికుమార్ లో రాత్రికిరాత్రే ఊరు దాటి ఎస్కేప్ అయ్యారు. తమకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు మోస పోయామని తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.