వైరల్ వీడియో.. భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య

వైరల్ వీడియో.. భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య

వేరే అమ్మాయితో పబ్ కు వెళ్లి అక్కడ డాన్స్ చేస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి వేరే అమ్మాయితో కలిసి పబ్బుకు వెళ్తాడు. అక్కడ అనారీ నంబర్ 1 సినిమాలోని మెయిన్ లైలా లైలా చిల్టౌంగ్ కుర్తా ఫడ్కే అనే పాటకు స్టెప్పులేస్తుంటాడు. అంతలోనే ఆ వ్యక్తి  భార్య వచ్చి చూస్తుంది. తనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నిలదీస్తుంది. 

వీడియో చూసినవాళ్లంతా పగలబడి నవ్వుతున్నారు. అయితే, ఈ వీడియో స్ట్రిప్ట్ అని తెలుస్తోంది. యూట్యూబ్ షార్ట్స్ కోసం స్క్రిప్ట్ ప్లే చేశారు. అయితే, ఈ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇక నీ పని అయిపోయిందని, ఇంటికెళ్లాక నీకుంటుందని ’ని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.