తాగుడు మానేస్తేనే ఇంటికొస్తనన్న భార్య... మనస్తాపంతో భర్త సూసైడ్

తాగుడు మానేస్తేనే ఇంటికొస్తనన్న భార్య... మనస్తాపంతో భర్త సూసైడ్

శామీర్ పేట, వెలుగు:  తాగుడు మానేస్తేనే నీ వద్దకు వస్తా అని భార్య చెప్పడంతో ఓ భర్త సూసైడ్ చేసుకున్నాడు. శామీర్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  శామీర్ పేటకు చెందిన బొసాల నరసింహ (26)  డ్రైవర్‌‌‌‌‌‌‌‌ గా పనిచేస్తున్నాడు. 8 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు.  భార్య పూజ  ప్రస్తుతం గర్భవతిగా ఉంది. డ్రైవింగ్ పనిలో నరసింహ ఉత్తరప్రదేశ్ కు వెళ్లాడు. అతడి భార్య అమీర్ పేటలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. నరసింహ తిరిగి సిటీకి వచ్చాడు. 

భార్యకు ఫోన్ చేసి తిరిగి రావాలని కోరాడు. మందు తాగడం మానేస్తేనే వస్తానని భార్య చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం భర్త నరసింహ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.  సోమవారం ఉదయం 9 గంటల సమయంలో భర్త ఇంటికి వెళ్లి చూడగా ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య పూజ ఫిర్యాదు మేరకు శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.