హుస్నాబాద్: ఆధునిక హంగులతో హుస్నాబాద్ బస్టాండ్‌‌

హుస్నాబాద్: ఆధునిక హంగులతో హుస్నాబాద్ బస్టాండ్‌‌
  • మంత్రి పొన్నం , ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్‌‌ బస్‌‌స్టేషన్‌‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి హుస్నాబాద్ బస్టాండ్‌‌ను పరిశీలించారు. బస్టాండ్‌‌లో ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో బస్టాండ్‌‌ ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ హుస్నాబాద్ బస్టాండ్ ద్వారా ప్రతిరోజూ 35 వేల మంది ప్రయాణిస్తున్నారన్నారు.

పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, టూరిజం, ఇండస్ట్రియల్ కారిడార్‌‌‌‌తో  హుస్నాబాద్ వేగంగా డెవలప్ అవుతోందన్నారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నామన్నారు. ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ హుస్నాబాద్ బస్టాండ్ కమర్షియల్‌‌గా ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చిపెడుతోందని,  దీనిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం హుస్నాబాద్ క్యాంప్ ఆఫీస్‌‌లో అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. వన మహోత్సవంలో రాష్ట్రంలోనే హుస్నాబాద్ నంబర్‌‌‌‌ వన్‌‌గా నిలవాలన్నారు. ఆ తర్వాత హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే కొత్తపల్లి రాజీవ్ రహదారి వరకు జరుగుతున్న ఫోర్ లేన్ రోడ్డు విస్తరణ పనులను మంత్రి పొన్నం పరిశీలించారు. రోడ్డు పక్కన ఉన్న పాత కరెంట్ పోల్స్ తీసేసి, కొత్తగా వేస్తున్న హై-వోల్టేజ్ విద్యుత్ టావర్ల పనుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఈడీ, కరీంనగర్ ఆర్‌‌‌‌ఎం రాజు  ఉన్నారు.