V6 News

హైదరాబాద్ సైంటిస్ట్ వెంకటేశ్వర్లుకు నేషనల్ అవార్డు

హైదరాబాద్ సైంటిస్ట్ వెంకటేశ్వర్లుకు నేషనల్ అవార్డు

బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్​కు చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సన్ క్రాప్స్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ సొంటి ఎస్. వెంకటేశ్వర్లుకు నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఢిల్లీలో నిర్వహించిన సమ్మిట్​లో కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ డైరెక్టర్ శోభ ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు.

శుక్రవారం బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో తను చేసిన కృషికి గతంలో కర్షక సేవా రత్నతో పాటు 15కు పైగా అవార్డులు వచ్చాయని తెలిపారు. పంట సమస్యలు, పరిష్కారాలపై మూడు భాషల్లో వేలాది పుస్తకాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు ఆయనను ఘనంగా సన్మానించారు.