హైదరాబాద్, వెలుగు: డిజిటల్ చెల్లింపుల సేవలు అందిస్తున్న హైదరాబాద్ ఫిన్‌టెక్ ఇన్ఫ్రా స్టార్టప్ వియానా సంస్థకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ నుంచి కీలక అనుమతి లభించింది. కస్టమర్ ఆపరేటింగ్ యూనిట్‌గా (సీఏయూ) పనిచేసేందుకు అర్హత సాధించింది.
ఫలితంగా విద్యుత్, నీరు, గ్యాస్, బ్రాండ్‌బ్యాండ్, మొబైల్ రీచార్జ్‌లు, డీటీహెచ్ సబ్‌స్క్రిప్షన్‌లు, బీమా ప్రీమియాలు, లోన్ ఈఎంఐలు వంటి పలు రకాల చెల్లింపుల సేవలను అందిస్తుంది.
బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు, ఇతర సంస్థలు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకుని తమ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల సేవలను అందించవచ్చని సంస్థ వ్యవస్థాపకుడు రవీంద్రనాథ్ యార్లగడ్డ తెలిపారు.
