ఆ దర్శకుడి కోసమే నటినయ్యా : అదితీరావు హైదరీ

ఆ దర్శకుడి కోసమే నటినయ్యా : అదితీరావు హైదరీ

హైదరాబాద్ బ్యూటీ అదితీరావు హైదరీ తన కెరీర్​ గురించి ఇంట్రెస్టింగ్​ విషయాలు చెప్పింది. తాను కథలను ఎంచుకునే విధానం భిన్నంగా ఉంటుందని తెలిపింది. ‘భాష ఏదైనా ముందు డైరెక్టర్​ నచ్చితేనే కథ వింటాను. అందులో నా రోల్​ కూడా నచ్చాలి. అప్పుడే సినిమా ఓకే చేస్తాను’ అని చెప్పింది. అయితే.. తను సినిమా రంగం ఎంచుకోవడానికిప్రధాన కారణం తమిళ దర్శకుడు మణిరత్నమేనట.

మణిరత్నం సినిమాలో నటించాలనే కోరికతోనే ఇండస్ట్రీ తలుపు తట్టిందట. అనుకున్నట్టుగానే ఈ ప్రేమకథల స్పెషలిస్ట్​ డైరెక్టర్​ వల్లే సౌత్​లో క్రేజ్​తెచ్చుకుంది. తనకు హీరో దుల్కర్​ సల్మాన్​తో ఎక్కువ చనువు ఉంటుందని, తామిద్దరం టామ్​ అండ్ జర్రీలా కొట్టుకుంటూనే ఉంటామని తెలిపింది.