రేసులోనే బ్లాక్‌‌హాక్స్‌‌ ..బెంగళూరుపై థ్రిల్లింగ్ విక్టరీ

రేసులోనే బ్లాక్‌‌హాక్స్‌‌ ..బెంగళూరుపై థ్రిల్లింగ్ విక్టరీ

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రైమ్‌‌ వాలీబాల్ లీగ్‌‌ నాలుగో సీజన్‌‌లో  ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్‌‌హ్యాక్స్ కీలక విజయం అందుకుంది. నాకౌట్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌‌లో  అద్భుత ఆటతో  టేబుల్ టాపర్‌‌‌‌ బెంగళూరు టార్పెడోస్‌‌కు చెక్ పెట్టింది.  

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌‌లో  బ్లాక్‌‌హాక్స్ 3–2 (13–15, 15–10, 18–16, 14–16, 15–11)తో ఐదు సెట్ల పాటు పోరాడి బెంగళూరును ఓడించింది. ఫలితంగా  మూడు విజయం ఖాతాలో వేసుకున్న హైదరాబాద్  9 పాయింట్లతో ఐదో ప్లేస్‌‌కు దూసుకొచ్చి నాకౌట్ రేసులో నిలిచింది. బ్లాక్‌‌హాక్స్‌‌ ప్లేయర్లలో శిఖర్‌‌ సింగ్‌‌, యుడి యమమోటో అద్భుతంగా ఆడారు.  కీలక మ్యాచ్‌‌లో గెలిచిన బ్లాక్‌‌హాక్స్‌‌ ఆటగాళ్లను ఆ టీమ్ ఓనర్‌‌‌‌ కంకణాల అభిషేక్‌‌ రెడ్డి అభినందించారు.ఈ మ్యాచ్‌‌కు ప్రముఖ సింగర్‌‌ స్మిత హాజరై అభిమానులను అలరించింది. మరో మ్యాచ్‌‌లో అహ్మదాబాద్ డిఫెండర్స్  3–1 (12–-15, 15–-7, 15–-12, 21–-20) తేడాతో  ముంబై మీటియర్స్‌‌ను ఓడించింది.