
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ నల్లగుట్ట(ఓల్డ్) ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్లు ఆడుకోవడానికి స్కూల్ పరిసరాల్లో భూమిని చదును చేయాలన్నారు. కిచెన్ ను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. టెన్త్‌క్లాస్ రూమ్ కు వెళ్లి స్టూడెంట్లతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పరీక్షలంటే భయపడొద్దని, ప్లాన్ప్రకారం చదివితే సక్సెస్సొంతమవుతుందన్నారు. ఐదారేండ్ల క్వశ్చన్ పేపర్లను తీసుకోని ప్రాక్టీస్ చేయాలన్నారు. ఎక్కువగా స్లిప్ టెస్ట్ లు రాయాలన్నారు. విద్యార్థులు పెండ్లిళ్లు , బంధువులు, పండగల కోసం టైం వృథా చేయకుండా చదువుపై ధ్యాస పెట్టాలన్నారు. డిప్యూటీ ఈఓ శ్రీధర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ఆఫ్ స్కూల్స్ గుండప్ప, స్వరూప, కృష్ణమూర్తి కలెక్టర్‌వెంట ఉన్నారు.