హైదరాబాద్ సిటీ దవాఖానాల్లో ఇకనుంచి 4 గంటల వరకు ఓపీ

హైదరాబాద్ సిటీ దవాఖానాల్లో ఇకనుంచి 4 గంటల వరకు  ఓపీ
  •       హైదరాబాద్ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ  పుట్టా శ్రీనివాస్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలోని బస్తీ దవాఖానలు, యూపీహెచ్​సీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ చూడాల్సిందేనని డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ పుట్టా శ్రీనివాస్ ఆదేశించారు. 

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఆడిటోరియంలో గురువారం జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,  బస్తీ దవాఖానలోని డాక్టర్లతో డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో సమీక్షా సమావేశం నిర్వహించారు. మెడికల్​ఆఫీసర్లే ఓపీ రిజిస్టర్​ రాయాలన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ శ్రీధర్, డా.సాయిబాబా, డా. శ్రీకళ పాల్గొన్నారు.