
హైదరాబాద్ మణికొండ విద్యుత్ శాఖ ఏడీఈ అధికారి అంబేద్కర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు పొందుపర్చారు పోలీసులు. ఏడీఈ అంబేద్కర్ అక్రమాస్తులు 200 కోట్లకు పైగా ఉన్నట్టు గుర్తించినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 16 ఉదయం నుంచి 11ప్రాంతాల్లో సోదాలు చేసి అంబేద్కర్ ను అరెస్టు చేసినట్లు ఏసీబీ తెలిపింది.
అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్ల 2.58 కోట్ల రూపాయల నగదు లభ్యం కావడం ఏసీబీ చరిత్రలో ఇంత మొత్తం లో డబ్బు దొరకటం మొదటిసారని తెలిపారు పోలీసులు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అంబేద్కర్ కెమికల్ ఫ్యాక్టరీ ను నెలకొల్పాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. సూర్యాపేట లో AMTHAR కెమికల్స్ ను రెండు సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసి కెమికల్స్ పేరుతో ఇథనాల్ తయారీ చేస్తున్నారు. దీనికి అంబేద్కర్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్నారు. అంబేద్కర్ అధిక పనులు బినామీలతోనే చేయించారు. బినామీలకు కాంట్రాక్టులు పనులు ఇప్పించి పని మొత్తం తానే చూసుకున్నాడు. కొన్ని నెలల క్రితమే అంబేద్కర్ పై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది.
గతంలో జిహెచ్ఎంసిలో ఏఈ గా పనిచేసిన అంబేద్కర్ డిస్కంలో పటాన్ చెరు కేపీహెచ్ బీ , గచ్చిబౌలి లో పనిచేయటంతో అధిక మొత్తంలో అక్రమ ఆస్తులు కూడా అర్జించారని ఆరోపణలు ఉన్నాయి. ఐటీ కారిడార్ లో వైరస్ బిల్డింగ్ లకు విద్యుత్ కనెక్షన్ల జారి సమయంలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. కనెక్షన్ ఇచ్చేందుకు లోడ్ సరిపోదని సాకు చెబుతూ వారి వద్ద నుంచి కోట్లలో లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు అంబేద్కర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. వట్టినాగులపల్లిలో వివాదంలో ఉన్న వెంచర్కు కనెక్షన్ ఇవ్వద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్న బేఖాతారూ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి.