V6 News

హైదరాబాద్ హీరోస్‌‌‌‌కు సుమిత్ రాయ్‌‌.. రగ్బీ ప్రీమియర్ లీగ్‌‌ వేలంలో రికార్డు ధరకు సొంతం

హైదరాబాద్ హీరోస్‌‌‌‌కు సుమిత్ రాయ్‌‌.. రగ్బీ ప్రీమియర్ లీగ్‌‌ వేలంలో రికార్డు ధరకు సొంతం

హైదరాబాద్, వెలుగు: రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్‌‌) రెండో సీజన్‌‌లో వెస్ట్‌‌ బెంగాల్‌‌కు చెందిన సుమిత్ కుమార్ రాయ్ రికార్డు సృష్టించాడు.  హైదరాబాద్‌‌లో గురువారం జరిగిన ఆటగాళ్ల వేలంలో  హైదరాబాద్ హీరోస్  ఫ్రాంచైజీ రూ. 3.75 లక్షల రికార్డు ధరకు అతడిని సొంతం చేసుకుంది. దాంతో  వేలంలో అత్యధిక ధర పలికిన ఇండియన్‌‌ ప్లేయర్‌‌‌‌గా సుమిత్‌‌ నిలిచాడు. జూన్ 16 నుంచి 28 వరకు  గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఈ మెగా లీగ్‌‌ కోసం హైదరాబాద్ హీరోస్ ఫ్రాంచైజీ బలమైన జట్టును రెడీ చేసుకుంది.

మోహిత్ ఖత్రి (రూ. 3.5 లక్షలు-చెన్నై బుల్స్), దీపక్ కుమార్ పునియా (రూ. 2.75 లక్షలు - ఢిల్లీ రెడ్జ్) భారీ రేటు దక్కించుకున్నారు. ఇక, ఈ సీజన్‌‌లో తొలిసారిగా 4 జట్లతో విమెన్స్ లీగ్‌‌ను కూడా నిర్వహించనున్నారు. అమ్మాయిల విభాగంలో ఢిల్లీకి చెందిన శిఖ యాదవ్  అత్యధికంగా రూ. 2.4 లక్షల ధరకు ఢిల్లీ రెడ్జ్ జట్టుకు ఎంపికైంది.  విమెన్స్‌‌ లీగ్‌‌ రాకతో ఈ ఆటలో సరికొత్త అధ్యాయం మొదలవుతోందని  రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్, జీఎంఆర్ స్పోర్ట్స్ సీఎంవో సుజోయ్ గంగూలీ పేర్కొన్నారు.