
మాదాపూర్, వెలుగు: మాదాపూర్ లోని ఓ హోటల్ లో శనివారం బ్యూటీ విత్ పర్పస్ పేరుతో నిర్వహించిన చారిటీ ఈవెంట్ లో మిస్ వరల్డ్ విన్నర్ ఓపల్ సుచాత, రన్నర్లు క్రిస్టినా, జాస్మైన్ పాల్గొన్నారు. మినిస్టర్లు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు గెస్టులుగా హాజరయ్యారు.
అంధ విద్యార్థులు, అనాథ చిన్నారులతో కలిసి మిస్ వరల్డ్ బ్యూటీ లు డిన్నర్ చేశారు. అనంతరం చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడారు. వారికి కొత్త బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. హైదరాబాద్ బ్రాండ్ ను గ్లోబల్ వైడ్ గా తీసుకువెళ్లేందుకు మిస్ వరల్డ్ పోటీలు
దోహదపడ్డాయన్నారు.