శివారుల్లో మంచు దుప్పటి.. రోడ్డు కనపడక వాహనదారులు ఇబ్బందులు

శివారుల్లో మంచు దుప్పటి.. రోడ్డు కనపడక వాహనదారులు ఇబ్బందులు

గండిపేట, వెలుగు: సిటీ శివారు ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పేసింది. మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, గండిపేట, నార్సింగి, ఓఆర్‌‌ఆర్ కిస్మత్‌‌పూర్, హిమాయత్​సాగర్ తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో సోమవారం తెల్లవారుజామున నుంచే దట్టమైన పొగ మంచు కమ్మేసింది. పొగ మంచు కారణంగా వాహనదారులు ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందు ఏమి వస్తుందో, వెళ్తుందో తెలియక తికమకపడ్డారు. వాహనాల హెడ్​లైట్స్ వేసినా కూడా పొగ మంచు కారణంగా ముందు కనిపించని పరిస్థితి ఏర్పడింది. కొన్ని చొట్ల పొగ మంచు కారణంగా ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు సైతం పొగ మంచు కారణంగా బోసిపోయి కనిపించాయి.