హైదరాబాద్‌లో బైక్ స్టంట్లు చేస్తున్న..ఆరుగురు యువకుల అరెస్ట్

హైదరాబాద్‌లో బైక్ స్టంట్లు చేస్తున్న..ఆరుగురు యువకుల అరెస్ట్

హైదరాబాద్ లో రోడ్లపై బైకులతో స్టంట్లు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తాపూర్, ఆరాంఘర్ రహదారిపై  వీలీలు, జిగ్ జాగ్ డ్రైవింగ్ తో వాహనదారులు భయాందోళనకు గురిచేసిన  ఆరుగురు యువకులను రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

ట్రిపుల్ రైడింగ్, స్పార్క్ స్టంట్లతో ప్రజల్లో భయాందోళనకు గురిచేస్తున్న నిందితులు సయ్యద్ షాహిద్, షేక్ నజీర్ హుసైన్, షేక్ జునైద్, మొహమ్మద్ బిన్ ఇసా, అబ్దుల్ సమద్, మొహమ్మద్ ఆర్ఫజ్ హుస్సేన్ ఖాన్ లను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులనుంచి 2 స్కూటీలు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు నిందితులపై గతంలోనూ బైక్ స్టంట్ కేసులు నమోదు అయ్యాయి.  ఒక నిందితుడిపై అత్తాపూర్ పీఎస్‌లో పోక్సో కేసు కూడా ఉంది. 

రోడ్లపై  ఇలా స్టంట్లు చేస్తూ ప్రజలను భయపెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని పోలీసుల సూచించారు. ప్రమాదకర 
డ్రైవింగ్ కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.